Mission, Vision & Values

Sri.L.SURESH ,
Honorable Advisor

అంతకుముందు జరిగే కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినప్పుడు కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. అవసరం, సమస్య, ఆలోచన, ప్రయత్నం ఇవన్నీ కలిపితే నూతన ఆవిష్కరణ అదే RK ఇన్సూరెన్స్ అకాడమీ. నమ్మకం, అనుభవం, భవిష్యత్తు విజన్ వీటన్నింటికీ మించి సరైన ఇంటెన్షనే RK ఇన్సూరెన్స్ అకాడమీ. ఇన్సూరెన్స్ రంగంలో ఏజెంట్‌గా మొదలుపెట్టడం సులభమే, కానీ నిలబడటం, ఎదగటం, నాయకుడిగా మారటం మాత్రం శిక్షణ లేకుండా సాధ్యం కాదు. ఆ అవసరాన్ని గుర్తించినప్పుడే అకాడమీ ఆవిర్భవించింది. గత రెండు సంవత్సరాలుగా ఏజెంట్స్ తమ మొదటి పాలసీ, స్థిరమైన ఆదాయం, ప్రొఫెషనల్ గుర్తింపు, నాయకత్వ పటిమ అకాడమీ ద్వారా సాధించగలిగారు.
ఇది కేవలం క్లాసుల కోసం ఏర్పాటైన అకాడమీ కాదు, సరైన సంకల్పంతో నడిచే మార్గదర్శక వ్యవస్థ, థియరీ కాదు రియల్ ప్రాక్టీస్,
ఇంగ్లీష్ భారం కాదు- తెలుగులో స్పష్టత. రికార్డ్ వీడియోలు కాదు-లైవ్ జూమ్ మార్గనిర్దేశం.  ఒక్కరోజు మోటివేషన్ కాదు-నిరంతర మెంటార్షిప్. ప్రతి ఏజెంట్ లో దాగివున్న సెల్ఫ్ పవర్ ను, కాన్ఫిడెన్స్ ను కెరీర్ విజన్ ను బయటకు తీసుకువచ్చి, అతని భవిష్యత్తుకు బంగారుబాట వేయడమే అకాడమీ లక్ష్యం.
ఇన్సూరెన్స్ రంగాన్ని నమ్ముకున్న వారికి గౌరవమైన కెరీర్ గా నమ్మదగిన సేవగా తరతరాలకు ఉపయోగపడే వృత్తిగా మార్చాలనే అలోచనతోనే అకాడమీ ముందుకు సాగుతోంది. మేనేజ్మెంట్, అకాడమీ సభ్యులు కూడా ఒకే విధమైన భావజాలం కలిగి ఉండడం అకాడమీ చేసుకున్న అదృష్టం.
ఆ భావజాలమే నేర్పుతూ నేర్చుకోవడం, ఆత్మగౌరవంతో ఆర్థికాభివృద్ధి.
అకాడమీ, మీ విజయ బాటలో అనేక మైలురాళ్లుగా నిలుస్తుందని మేము నమ్ముతున్నాము. విజయం యాదృచ్చికం కాదు. అది సరైన మార్గదర్శక ఫలితం.
విజయాభినందనలతో…

“నేర్చుకోవడం సృజనాత్మకతను ఇస్తుంది,
సృజనాత్మకత ఆలోచనలకు దారి తీస్తుంది,
ఆలోచనలు జ్ఞానాన్ని అందిస్తాయి,
జ్ఞానం మిమ్మల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది.”

“LEARNING GIVES CREATIVITY, CREATIVITY LEADS TO THINKING, THINKING PROVIDES KNOWLEDGE, KNOWLEDGE MAKES YOU GREAT.”

Sri.MAMIDI BALAKRISHNA, SBA. Honorable Guest Speaker

Sri.M.S.RAGHU

Rtd.BM, LIC OF INDIA

మిత్రులారా,
నాకు శ్రీ గువ్వల రామకృష్ణారెడ్డి గారు మరియు లింగమనేని సురేష్ గారితో 2016 నుండి పరిచయం ఉంది. ఏజెంట్ మిత్రుల సమస్యలను పరిష్కరించడంలో వీరు ఎప్పుడూ ముందంజలో నిలిచారు. నిజానికి, జ్ఞానం ఒక దివ్యమైన సంపద, మరియు శ్రీ R.K గారు మరియు శ్రీ L.SURESH గారు తమ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఏజెంట్ మిత్రులకు సహకరించి, వారి ఉన్నత స్థాయికి దారితీసారు. వారి సహకారం  వలన చాలామంది ఏజెంట్ మిత్రులు తమ బీమా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వీరిరువురితో గడిపిన మూడు సంవత్సరాలు నాకు చాలా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

R.K. ఇన్సూరెన్స్ అకాడమీ రెండో వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా  జరుపుకున్న  సందర్భంగా, నా హృదయపూర్వక అభినందనలు. ఈ సంస్థ మరింత ఎదుగుదలను సాధించి, ఇంకా ఏజెంట్ మిత్రులకు తోడ్పాటు అందించాలని ఆశిస్తున్నాను.

                                            మీ,
                                           ఎం.ఎస్. రఘు
                                           Rtd BM, LIC OF INDIA

ఇది సరైన సమయం… సరైన నిర్ణయం –
శ్రీ రామకృష్ణ రెడ్డి గారి దూరదృష్టి.
ప్రస్తుత కాలంలో AI టెక్నాలజీ మానవ ఉపాధి అవకాశాలను వేగంగా తగ్గిస్తోంది.
ఈ పరిస్థితుల్లో అత్యున్నత నైపుణ్యాలు కలిగి, నిత్యం టెక్నాలజీని స్వీకరించే వారు మాత్రమే నిలబడగలుగుతారు.
ప్రత్యేకంగా మార్కెటింగ్,సేల్స్ ప్రొఫెషనల్స్, కన్సల్టెంట్లు, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ కలయికతో పనిచేసే ఇన్సూరెన్స్ ఏజెంట్లకు, 
రోజువారీ అప్డేటెడ్ నాలెడ్జ్ అత్యంత అవసరం.
శ్రీ రామకృష్ణ రెడ్డి గారు ఇన్సూరెన్స్ రంగంలో విశాల అనుభవం, లోతైన జ్ఞానం కలిగిన వ్యక్తి. అంతేకాదు, తన అనుభవాన్ని ఆసక్తి గల ఇన్సూరెన్స్ అభ్యర్థులతో పంచుకోవాలనే తపన కలిగిన వ్యక్తి. ఆయన లక్ష్యం ఒక్కటే –
“అందరి కోసం ఒకరు – ఒకరికోసం అందరూ.”
నా అవగాహన మేరకు, తెలుగు భాషలో ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఫోర్స్ కోసం ఏర్పాటు చేసిన తొలి అకాడమీ & వెబ్‌సైట్ ఇదే అనే విషయం గర్వకారణం.

ఈ RK INSURANCE ACADEMY రాబోయే రోజుల్లో
ఇన్సూరెన్స్ రంగంలో ఫీల్డ్ ఫోర్స్ ను వృత్తి నిపుణుడిగా & టెక్నాలజీ పరంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
“Unless until we are updated, Otherwise we are Outdated”.

Sri.ANJURI MADHU BABU ,
Rtd ABM'S, ELURU

నేర్పుతూ నేర్చుకోవడం - ఆత్మగౌరవంతో ఆర్థికాభివృద్ధి ( RIGHT TIME TECHNOLOGY KNOWLEDGE ) ✦